‘ఆమెకథ ‘ హీరో కి కరోనా పాజిటివ్..!!

వాస్తవం ప్రతినిధి:  ప్రభుత్వం సడలింపులతో కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ సీరియల్ పరిశ్రమ షూటింగ్ మొదలు పెట్టింది. కరోనా నిబంధనలు పాటిస్తున్నప్పటికీ పలువురు కరోనా బారిన పడుతున్నారు. బుల్లితెరపై తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో రవికృష్ణ తాజాగా మహమ్మారి కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతడే స్వయంగా వెల్లడించాడు. మూడు రోజుల క్రితం చేసిన పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని పేర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్‌ అయిన వారు ఇంట్లోనే ఉండి వీలైతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. గత మూడు రోజులుగా ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశాడు. తనతో కలిసి పని చేసిన వారిని పరీక్షించి ఆ తర్వాత ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని అభ్యర్ధించాడు రవికృష్ణ.