ప్రముఖ సీరియల్ నటుడుకి కరోనా పాజిటివ్..!

వాస్తవం ప్రతినిధి: టీవీ నటీనటులను సైతం కరోనా మహమ్మారి అల్లాడిస్తుంది. కరోనా కారణంగా ఇన్ని రోజులు షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నారు బుల్లితెర నటీనటులు. ఇక లాక్ డౌన్ సడలింపులు తర్వాత మళ్ళీ షూటింగ్స్ ప్రారంభం కావడంతోనే పనిలో బిజీగా మారిపోయారు. దీంతో రోజు రోజుకు కరోనా బారిన పడుతున్న నటీనటుల సంఖ్య పెరుగుతుంది.

ఇప్పటికే సీరియల్ నటులు ప్రభాకర్, హరికృష్ణలు, ఆమె కధ నటి నవ్య స్వామి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నటుడు ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డాడు. టీవీ నటుడు సాక్షి శివకు కరోనా సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ చానెళ్లలో ప్రసారమవుతున్న అక్క మొగుడు, నెంబర్‌ 1 కోడలు, మౌనరాగం సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో మరోసారి టీవీ పరిశ్రమలో కలకలం రేగింది.