కరోనా తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి..!!

వాస్తవం ప్రతినిధి: టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకిరి రామారావు (64) కరోనాతో కన్నుమూశారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి ఇటీవల పోకూరి రామారావుకి సోకింది. దీంతో గత కొన్నిరోజులుగా ఆయన హైద‌రాబాద్ కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే క్రమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా విష‌మించడంతో.. నేడు ఉదయం 9గంటల సమయంలో ఆయనకు గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

పోకూరి రామారావు, ఈత‌రం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోద‌రుడు. ఈ తరం ఫిల్మ్స్ బ్యానర్ లో పోకూరి రామారావు అనేక హిట్ చిత్రాలు నిర్మించారు. పోకూరి రామారావు అకాల మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబానికి ధైర్యం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.