తెలంగాణ సర్కార్ పై సీరియస్ అయిన హైకోర్టు..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కరోనా వచ్చిన నాటి నుండి వరుసగా మొట్టికాయలు వేస్తూనే ఉంది. తెలంగాణ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మొదటి నుండి సీరియస్ వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. రాష్ట్రంలో త్వరలోనే వ్యాప్తి ఎక్కువగా ఉన్న తరుణంలో ఇటీవల పిటిషన్లు దాఖలైన టైములో రోజుకి ఎన్ని నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు అన్ని లెక్కలు చెప్పాలనే విధంగా సీరియస్ వ్యాఖ్యలు చేయటం మనం చూశాం. ఇప్పుడు అదే విధంగా ఆన్ లైన్ తరగతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ అయింది. నెక్స్ట్ విద్యా సంవత్సరం మొదలు కాకముందే విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడం ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తే ప్రతి ఇంటిలో 2,3 లాప్ టాప్స్ కలిగిన పరిస్థితి ఉందా అని ప్రశ్నించింది. మహమ్మారి కరోనా వైరస్ తో ప్రజల జీవితం స్తంభించి ఉన్న సమయంలో విద్యాసంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తుంటే చర్యలు తీసుకోవాలి కదా అని ప్రశ్నించింది. దీంతో త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. కాగా ఈనెల 13 లోపు ప్రభుత్వ ప్రణాళిక ఏంటో సరైన రీతిలో నివేదిక న్యాయస్థానానికి అందించాలని హైకోర్టు తెలిపింది.