బిజెపి కి కొత్త తలనొప్పులు తెస్తున్న వైసిపి..??

వాస్తవం ప్రతినిధి: గత కొన్ని రోజులుగా వైసిపిలో జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఏపి రాజకీయాలోనే కాదు.. ఢిల్లీలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తలనొప్పులు తెచ్చిన కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు వైసిపి కే కాదు.. బిజెపికి కి తలనొప్పిగా మారింది. వైసిపి నేతలు అయితే మాత్రం రఘురామ కృష్ణంరాజు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అతన్ని పార్టీ నుంచి పంపించడానికి అన్ని ప్రణాళికలు వేసింది. వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి.. స్పీకర్ ఓంబిర్లాను కలిసి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఎంపీలు కోరారు. దీంతో ఈ తలనొప్పి కాస్తా ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీ వైపు మళ్ళింది. వైసీపీ.. రఘురామ కృష్ణం రాజు ను పార్టీ నుంచి బయటకు పంపించెంత వరకే పరిమితమవుతుంది. కానీ పార్లమెంటు నుంచి బయటకు పంపించాలంటే మాత్రం ఆ పని బిజెపి చేతిలోనే ఉంది. మరి బిజెపి ఈ పనిచేస్తుందా లేదా, అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తుందా లేదా వైసిపి చేస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.