‘‘నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా”..: సుజనా చౌదరి

వాస్తవం ప్రతినిధి: అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని మరోసారి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. రాజధాని పోరాటానికి నేటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రైతులు, జేఏసీ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతుల పోరాటానికి మద్దతుగా సుజనా ట్వీట్ చేశారు.

‘‘నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది.’’ అని సుజనా ట్వీట్ చేశారు.

అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణ యం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజన్నారు. ఉద్యమంలో పాల్గొ న్న రైతులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టారని, మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారని సుజనా మండి పడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వలన మనోవేదనకులోనై అనేక మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర భవిష్యత్‌, భావితరాల అభ్యున్నతి కోసం రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు తప్ప పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో కాదన్నారు. అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండేలా చంద్ర బాబు నాయుడు అసెంబ్లి లో అమరావతిని ప్రతి పాదించిన ప్పుడు ప్రతిపక్షనేతగా జగన్మోహన రెడ్డి బలపరిచారని ఆయ న గుర్తు చేశారు. ఇదే జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైన కారణం లేకుండానే ఇష్టానుసారం రాజ ధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారన్నారు.