రాజధాని గా అమరావతి నే కొనసాగించాలి :ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న  రైతుల పోరాటం 200 రోజులు అయిన సందర్భంగా వారికి సంఘీ భావం గా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గారి కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ టౌన్ మరియు మండల పార్టీ ఆధ్వర్యంలో అమరావతి సంఘీభావ నిరసనకార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా రాజేంద్రప్రసాద్ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సకల సదుపాయాలతో రాష్ట్రం లోని 13 జిల్లాలకు సమదూరం లో ఉన్న, రాజధాని అమరావతి ని మార్చడం కక్ష పూరిత చర్య అని, మూడు రాజధానులు వద్దు అమరావతినే రాజధాని గా కొనసాగించాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

రాజధాని మార్పు పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేసి, ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఉద్యమం లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు,మరియు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద,పింగళి వెంకయ్య గార్ల లకు రాజేంద్రప్రసాద్ నివాళ్ళు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉయ్యూరు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపాన.గురునాథ రావు,నగర పంచాయతీ మాజీ చైర్మన్ అబ్దుల్.ఖుద్దుస్,తెలుగుదేశం పార్టీ నాయకులు కూనపరెడ్డి శ్రీనివాసరావు, చక్కా సుబ్బారావు, పంద్రాజు చిరంజీవి, చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, ఈడే అంజి బాబూ, రఫీ,రాజులపాటి ఫణి కుమార్ వల్లూరి కిరణ్,భాగ్యరాజు పవన్ పాల్గొన్నారు.