లడక్ లో ప్రధాని మోడీ ఆకస్మిక పర్యటన!

వాస్తవం ప్రతినిధి: భారత-చైనా సరిహద్దూల్ ఉద్రిక్తతల నేపధ్యంలో నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా ఆ ప్రాంతంలో పర్యటించారు.. డిఫెన్స్ స్టాప్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నర్వేణేతో కలసి ఆయన ప్రత్యేక ఆర్మి హెలికాప్టర్ లో లడక్ కు చేరుకున్నారు.. ఇక్కడ నిమూ పోెస్ట వద్ద ఆర్మి సిబ్బందిను ఆయను కలుసుకుని మాట్లాడారు.. అక్కడ పరిస్థితులను స్వయంగా సీనియర్ ఆర్మి అధికారులను అడిగి తెలుసుకున్నారు.. సరిహద్దులలో నిము ఫార్వర్డ లైన్ జన్సకర్ పర్వతశ్రేణిలో 1100 అడుగుల ఎత్తులో ఇండస్ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది.. అక్కడ ఆర్మి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.. సైనికులలో మనోధైర్యాన్ని నింపారు.. అక్కడ అయన రెండు గంటల పాటు గడిపారు..