లాక్ డౌన్ టైమ్ లో మహేష్ , నమ్రత జంటకు రష్మిక మందన అదిరిపోయే గిఫ్ట్…!!

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో ఇద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ ని ఆటపట్టించే పిల్లగా రష్మిక తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మికా కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కాగా ఇటీవల లాక్డౌన్ టైం లో రష్మిక తన కుటుంబ సభ్యులతో ఇంటిలోనే గడపడం జరిగింది. కాగా సరిలేరు నీకెవ్వరు సినిమా విజయంతో మహేష్ కుటుంబానికి కూడా ఎంతో సన్నిహితంగా దగ్గరయ్యింది రష్మిక. ఈ నేపథ్యంలోనే మహేష్ నమ్రతా లకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్రెష్ ఆవకాయ మామిడికాయ పచ్చడి పంపించి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని నమ్రతా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా అద్భుతమైన వాతావరణంలో నోరూరించే పచ్చడి పంపించినందుకు రష్మికా కి కూడా నమ్రత కృతజ్ఞతలు తెలపడం జరిగింది.