హీరో నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్..??

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి జీవితంలో అడుగుపెట్టడానికి రెడీ అయిపోయాడు. లాక్ డౌన్ టైమ్ లో ఏప్రిల్ 15వ తారీఖున హైదరాబాదులో నితిన్ మరియు శాలిని ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా జూలై 26 వ తారీఖున హైదరాబాదులో ఫలక్‌నామా ప్యాలస్‌లో కేవలం కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న హీరో నితిన్ మరియు షాలిని పెద్దల అంగీకారంతో ఒకటి కాబోతున్నారట. మామూలుగా కరోన రాకముందు పెళ్లి దుబాయిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. మహమ్మారి వైరస్ రాకతో పూర్తిగా ప్లానంతా తారుమారు కావడంతో ఈ నెల 26న కుటుంబ సభ్యుల మధ్య యంగ్ హీరో నితిన్ శాలిని పెళ్లి జరగబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా లాక్ డౌన్ ముందు భీష్మ సినిమా తో అదిరిపోయే హిట్ కొట్టిన నితిన్ ప్రజెంట్ నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు.