ప్రభాస్ తో మరోసారి రానా సినిమా..??

వాస్తవం సినిమా: ‘బాహుబలి’ సినిమాలో బల్లాల దేవా పాత్రలో ప్రభాస్ తో పోటాపోటీగా రానా నటించిన ప్రతినాయకుడి పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకోవటం జరిగిందో అందరికీ తెలుసు. మాహిష్మతి సింహాసనం కోసం ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు నువ్వానేనా అన్నట్టుగా రాజమౌళి తెరకెక్కించిన విధానానికి చాలామంది ఆడియెన్స్ ముగ్ధులు అయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ అని అనుకుంటున్న టైటిల్ సినిమాలో రానా రెండు నిమిషాల పాత్ర చేయబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. మొదటిలో ఈ పాత్రకోసం గోపీచంద్ ని అనుకోగా… ఆ పాత్ర యొక్క విశిష్టత తెలుసుకొని దీనికి రానా అయితే కరెక్టుగా సరిపోతాడు అని ప్రభాస్ డైరెక్టర్ కి చెప్పటంతో … ఈ పాత్ర కోసం రానా ని సంప్రదించినట్లు అంతా ఓకే అయినట్లు సమాచారం.