యాంకర్ పై సీరియస్ అయిన సాయిపల్లవి..!!

వాస్తవం సినిమా: ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ అమ్మాయి గా నటించిన నటనకు భానుమతి పాత్రకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మాస్ తరహాలో మొండి అమ్మాయిగా భానుమతి నటించిన పాత్ర ఫిదా సినిమాకి హైలెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత కుర్ర హీరోలతో సినిమాలు చేసినా ఆ సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఈ క్రమంలో సినిమాలో తన క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంటేనే సినిమా చేయటానికి ఇష్టపడే సాయిపల్లవి….మహేష్ బాబు మరియు విజయ్ దేవరకొండ వంటి హీరోల పక్కన ఛాన్స్ వచ్చినా క్యారెక్టర్ సరిగ్గా లేకపోవడంతో డ్రాప్ అయిపోయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ని యాంకర్ మలయాళీ అని సంబోధించడం తో ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. నేను మలయాళీ అమ్మాయిని కాదు పక్కా తమిళ్ అమ్మాయిని నన్ను మలయాళీ అని పిలవద్దు నాకు ఇష్టం ఉండదు ఆ పేరు అని సదరు యాంకర్ పై సీరియస్ అయింది. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.