కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ కి ఇటీవల కరోనా సోకింది అన్న విషయం అందరికీ తెలిసిందే. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవటానికి డాక్టర్ వద్దకు వెళ్లిన టైమ్ లో కరోనా టెస్ట్ చేసుకోవాలని డాక్టర్ తెలపడం జరిగింది. దీంతో కరోనా టెస్ట్ చేయించుకున్న బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ రావటంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదే తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన్ని కలిసిన వారు కూడా తమకి కూడా కరోనా వచ్చింది ఏమో అని టెస్ట్ లు చేసుకున్నారు. కానీ బండ్ల గణేష్ వల్ల ఎవరికి సోకినట్టు వార్తలు రాలేదు. దీంతో కరోనా వచ్చిన కారణంగా అపోలో ఆసుపత్రిలో చేరిన బండ్లగణేష్ మొన్నటి వరకు చికిత్స చేయించుకున్నారు. తాజాగా ఇటీవల మళ్ళీ కరోనా పరీక్షలు చేయించుకోవటం తో నెగిటివ్ రావటంతో… వచ్చిన రిపోర్టులు సోషల్ మీడియా లో పెట్టి దేవుడికి కృతజ్ఞతలు ప్రార్థించిన అభిమానులకు కూడా అంటూ పోస్ట్ పెట్టారు. బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకోవడంతో అభిమానులు హమ్మయ్య బండ్ల అన్న సేఫ్ అని పోస్టులు పెడుతున్నారు.