లాక్ డౌన్ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర హోం శాఖ నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఇక నూతనంగా జారీ చేసిన లాక్డౌన్ జీవో ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సర్వీసులు తప్ప ఎవరూ బయటకు రాకూడదు. ఒక్క అత్యవసర సర్వీసులు మినహా రాత్రి 9.30 గంటల తర్వాత ఎవరూ షాపులు తెరిచి ఉంచకూడదు.