అస్సాంలో వరద బీభత్సం.. భారీగా ఆస్థి- ప్రాణ నష్టం!

వాస్తవం ప్రతినిధి: బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాలుస్తోంది. భారీ వర్షాలతో అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఆ రాష్ట్రంలో వరదలు వచ్చేలా పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై నివారణ చర్యలు ప్రారంభించింది.

భారీ వర్షాలతో వరదలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అస్సాంలో దుర్భర పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు ఉండగా 25 జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. దీని ప్రభావంతో 13.2 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. ఈ వరదలకు ప్రాణనష్టం భారీగా ఉంటోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 25కు చేరుకుంది.

బార్పేట జిల్లా వరదలకు తీవ్ర ప్రభావానికి గురైంది. ఈ ఒక్క జిల్లాలో 75700 హెక్టార్ల వ్యవసాయ భూమి కోతకు గురైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై గడిచిన 24 గంటల్లో 3245 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.