పేదలను ఆకట్టుకునే విధంగా ప్రకటన చేసిన మమతా బెనర్జీ..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల జాతినుద్దేశించి మోడీ ప్రసంగం చేసిన సమయంలో ఉచిత రేషన్ నవంబర్ నెల వరకు ఇస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో భయంకరంగా సంక్షోభం ఏర్పడిన తరుణంలో ఉచిత రేషన్ వచ్చే ఏడాది జూన్ వరకు ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతో మమతా బెనర్జీ చేసిన ప్రకటనకు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంతగానో సంతోషించారు. త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మమతా బెనర్జీ చేసిన ప్రకటన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ బిజెపి పార్టీ తోనే నువ్వానేనా అన్నట్టుగా రాష్ట్రంలో మరియు కేంద్రంలో పోరాడుతుంది. ఇలాంటి తరుణంలో ఎక్కడా కూడా పశ్చిమ బెంగాల్ ప్రజలు దృష్టి డైవర్ట్ అవ్వకుండా పరిపాలన విషయంలో అలర్ట్ గా ఉంటూ మరోసారి పశ్చిమ బెంగాల్లో గెలవడానికి మమత సరైన స్ట్రాటజీ లు వేస్తోంది.