మళ్లీ లాక్ డౌన్.. ఒక్కసారిగా సీరియస్ అయిన మెగా బ్రదర్ నాగబాబు..!!

వాస్తవం ప్రతినిధి: ఇండియాలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఊహించని విధంగా 20,000 నమోదు కావటం అటు కేంద్రంలోనూ, వైద్య రంగంలోనూ టెన్షన్ నెలకొంది. ఇటువంటి టైం లో మళ్లీ లాక్ డౌన్ చేపడతారు అంటూ వస్తున్న వార్తల పై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో లాక్ డౌన్ మళ్లీ అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఉద్దేశించి నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ విధించడం అనేది ప్రభుత్వాలు చేసే అతి పెద్ద చరిత్రాత్మకమైన తప్పు అని పేర్కొన్నారు. మొదటిలో గుర్తించిన లాక్ డౌన్ లో వైరస్ కి సంబంధించిన మెడిసిన్ గాని వ్యాక్సిన్ గానీ అందుబాటులోకి తెచ్చి ఉండి ఉంటే సమస్య ఇక్కడి దాకా వచ్చేది కాదని పేర్కొన్నారు. మరొకసారి లాక్ డౌన్ చేపడితే పేదవాడి పరిస్థితి మరింత ప్రమాదంలో కి వెళ్లి పోయే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. 90 రోజులు విధించిన లాక్ డౌన్ టైమ్ లో ప్రభుత్వాలు మెడికల్ రిసోర్సెస్ అన్నీ సమకూర్చుకుని ఎలాంటి పరిస్థితిని అయినా జయించే లాగా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చాడు. అలా కాదని ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ అంటే అది ప్రభుత్వానికి తీరని నష్టాన్ని మిగుల్చుతుంది అని చెప్పుకొచ్చారు.