రఘురామకృష్ణంరాజుపై వైసీపీ చర్యలు..త్వరలో ఆ నిర్ణయం తీసుకోనున్న సర్కార్!

వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి జగన్ పై తనకు ఎంతో అభిమానం ఉందని చెపుతూనే… అధిష్టానానికి వ్యతిరేకంగా పార్టీపై, పార్టీ నేతలపై ఆయన చేస్తున్న విమర్శలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలకు వైసీపీ సిద్ధమవుతోంది. షోకాజ్ నోటీస్‌‌పై రఘురామకృష్ణంరాజు స్పందించిన తీరుపై ఆగ్రహంతో ఉన్న అధిష్టానం ఇక, ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా,సీ ఎం జగన్ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటేయాలంటూ త్వరలో లోక్‌సభ స్పీకర్‌కు పిటిషన్‌ ఇవ్వనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజుపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక తేడా మనిషి అంటూ మండిపడ్డారు. ఆయనను తాను ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారని… అందుకే మోదీ భజన చేస్తున్నారని ఆరోపించారు.