తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు రద్దు..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మళ్లీ లాక్డౌన్ విషయంలో హైకోర్టు లో పిటిషన్ పడింది. ఈ సందర్భంగా న్యాయస్థానం మరి లాక్ డౌన్ పెడితే జరగాల్సిన ప్రవేశ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందని ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా లాక్ డౌన్ పై మంత్రివర్గం సమావేశం అయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఆ మీదట ఎజి ప్రభుత్వంలోని ముఖ్యులతో మాట్లాడి ప్రవేశ పరీక్షలన్నిటిని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఎమ్.సెట్ కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ప్రవేశ పరీక్షలు జరిగే సెంటర్లు ఉండటంతో, హైదరాబాద్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.