ఆఫ్ఘ‌నిస్థాన్‌‌లో రాకెట్ల వర్షం..ప‌లువురు పౌరులు మృతి

వాస్తవం ప్రతినిధి: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సోమవారం మ‌ధ్యాహ్నం జరిగిన రాకెట్ల దాడిలో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. హెల్మండ్ ప్రావిన్స్ సంగిన్ జిల్లాలోని పశువుల మార్కెట్లో ఈ రాకెట్ల దాడి జ‌రిగింది. వివిధ జిల్లాల నుండి వందలాది మంది గ్రామస్తులు గొర్రెలు, మేకలను క్రయ విక్రయాలు చేస్తుంటారు. ఈ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. మ‌రోవైపు హెల్మండ్‌లో రాకెట్ల దాడి నిజ‌మేన‌ని అధికారులు ధృవీక‌రించారు. కాని పూర్తి వివ‌రాల‌ను అక్కడి అధికారులు వెల్ల‌డించ‌లేదు.