వందే భార‌త్ మిష‌న్: గంట‌ల వ్య‌వ‌ధిలోనే టికెట్లు మెత్తం అమ్ముడుపోయాయి

వాస్తవం ప్రతినిధి: ‘వందే భార‌త్ మిష‌న్’ నాల్గో ద‌శ‌లో భాగంగా యూఏఈ నుంచి స్వ‌దేశానికి వ‌చ్చేందుకు భార‌త ప్ర‌వాసులకు ఇండియ‌న్ ఎంబ‌సీ నేరుగా విమాన‌ టికెట్ బుక్ చేసుకునే స‌దుపాయం క‌ల్పించిన సంగతి తెలిసిందే. అయితే, టికెట్ల విక్ర‌యం ప్రారంభ‌మైన గంట‌ల వ్య‌వ‌ధిలోనే మొత్తం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన‌ట్లు భార‌త అధికారి ఒక‌రు తెలిపారు. ఇక ఈ నాల్గో ద‌శలో భాగంగా యూఏఈ నుంచి భార‌త్‌లోని కేర‌ళ‌తో పాటు హైద‌రాబాద్‌, ల‌క్నో, ఢిల్లీల‌కు ఈ స్పెష‌ల్ ఫ్లైట్ న‌డ‌ప‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టికే www.airindiaexpress.in వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ ప్రారంభించిన భార‌త ఎంబ‌సీ… మిగిలిన టికెట్ల‌ను ఇలా నేరుగా విక్ర‌యిస్తోంది.