ఇంగ్లాండ్‌లో ఘనంగా జరిగిన పీవీ శత జయంతి ఉత్సవాలు

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హామ్ నగరంలో భారత మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొద్ది మందితోనే ఈ వేడుకలు జరిగాయి. ఆర్థిక సంస్కరణలతో పీ.వీ. నరసింహారావు దేశానికి దిశానిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రవాస భారతీయులు ఈ సందర్భంగా కొనియాడారు. మరోపక్క పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో, కేబినెట్‌లో తీర్మానం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తామంతా సమర్థిస్తున్నట్టు ప్రవాసులు తెలిపారు.