వందే భారత్ మిషన్‌: వాషింగ్టన్ నుంచి స్వదేశానికి బయలుదేరిన 195 మంది ఎన్నారైలు

వాస్తవం ప్రతినిధి: వందే భారత్ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం అమెరికా నుంచి భారత్‌కు బయలుదేరింది. ఈ విమానంలో మొత్తం 195 మంది భారతీయులు ప్రయాణిస్తున్నట్టు అమెరికాలోని ఇండియన్ ఎంబసి వెల్లడించింది. కాగా వందే భారత్ మిషన్ లో భాగంగా నేటితో మూడో విడత కూడా పూర్తికానుంది. జులై 1 నుంచి నాలుగో విడత ప్రారంభించనున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గత గురువారం వరకు వందే భారత్ మిషన్‌లో భాగంగా 3,64,209 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు విదేశాంగశాఖ తెలిపింది. వందే భారత్ మిషన్‌లో కేవలం విమానాల ద్వారానే కాకుండా యుద్దనౌకల ద్వారా కూడా స్వదేశానికి చేరుకుంటున్నారు.