టిక్‌టాక్ బంద్  ..వార్నర్‌ను టీజ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్

వాస్తవం ప్రతినిధి: ఛైనా నిషేధయాప్‌ల జాబితాలో భారత్‌లో బాగా ప్రాచూర్యం పొందిన టిక్‌టాక్ కూడా ఉంది. ఇక టిక్‌టాక్ భారత్‌లో బంద్ అయిన విషయాన్ని తెలియజేస్తూ ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ను భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీజ్ చేశాడు. ‘అప్పో అన్వర్.. డేవిడ్ వార్నర్’అంటూ చింతిస్తున్న ఎమోజీని ట్వీట్ చేశాడు. ఇక.. అశ్విన్ చేసిన ట్వీట్ లోని‘అప్పో అన్వర్’ డైలాగ్ రజినీకాంత్ భాషా చిత్రంలోనిది కావడం గమనార్హం. ఇక 59 యాప్ నిషేధం గురించి ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ అశ్విన్ వార్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.