డ్రాగన్ కంట్రీ చైనాపై తీవ్రస్థాయిలో మండిపడ్డ హర్భజన్ సింగ్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ డ్రాగన్ కంట్రీ చైనాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కరోనా వైరస్ చైనా కుట్రేనని ఇప్పటికే ఆరోపించిన ఈ స్టార్ స్పిన్నర్.. ఆదేశ ఉత్పత్తులను నిషేధించాలని కూడా డిమాండ్ చేశాడు. ఇక తాజాగా చైనాలో కరోనా తరహాలో మరో మహమ్మారి పురుడుపోసుకుందని వస్తున్న వార్తలపై స్పందించిన భజ్జీ.. ఇది కూడా చైనా కుట్రేనని ఆరోపిస్తూ మండిపడ్డాడు.

పందుల్లో స్వైన్ ఫ్లూ వంటి మరో రకం వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిపిన రాయిటర్స్ కథనాన్ని రీట్వీట్ చేసిన భజ్జీ.. ఇప్పటికే కరోనాతో ఏగలేకపోతున్నామంటే మరోకటి తయారు చేసారా? అని డ్రాగన్ కంట్రీపై ధ్వజమెత్తాడు. ‘యావత్ ప్రపంచం కరోనాతో ఏగలేక సతమతమవుతుంటే.. వాళ్లేమో మన కోసం మరో వైరస్ సిద్దం చేశారు’కర్మరా బాబు అనే ఎమోజీలతో ట్వీట్ చేశాడు.