ధోనీని చాలా మిస్ అవుతున్నా: కుల్దీప్ యాదవ్

వాస్తవం ప్రతినిధి: గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌ కప్ తర్వాత నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో మహీని మళ్లీ గ్రౌండ్‌లో చూడాలన్న ఫ్యాన్స్ కోరికతోపాటు పలువురు సహచర ఆటగాళ్ల ఆశలకు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ధోనీని తాను వ్యక్తిగతంగా చాలా మిస్ అవుతున్నానని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పాడు. నేను ధోనీకి పెద్ద ఫ్యాన్‌ను. అతడు త్వరలోనే టీమ్‌లోకి తిరిగి రావాలని, జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా. ఇండియాకు ధోని ఆడాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. మేం ఎప్పుడు ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినా మహీ మంచి సూచనలతో ముందుకొచ్చేవాడు. అలాంటి అడ్వయిజ్‌లు నా కెరీర్‌‌కు ఎంతో హెల్ప్‌ అయ్యాయి అని కుల్దీప్ పేర్కొన్నాడు.