కోహ్లీ సక్సెస్ కు అదే కారణం: విక్రమ్ రాథోర్

వాస్తవం ప్రతినిధి: పరిస్థితులకు తగ్గట్టుగా ఆట తీరును మార్చుకోవడంలో విరాట్ కోహ్లీ దిట్ట అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అన్నాడు. ‘కోహ్లీలో నాకు నచ్చిన అంశం ఆటపై అతనికి ఉన్న కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌. వరల్డ్ ‌‌‌లోనే బెస్ట్ ‌‌‌ప్లేయర్‌‌‌‌గా ఉండాలని ఎప్పుడూ అనుకుంటాడు. దీనికోసం ఇంతలా కష్టపడే క్రికెటర్‌‌‌‌ను నేనెప్పుడూ చూడలేదు. అవసరమైనప్పుడు ఆట స్వరూపాన్నేమార్చేస్తుంటాడు. ఇందుకోసం తన ఆట తీరునే మార్చేసుకుంటాడు. ప్రతి ఫార్మాట్లో డిఫరెంట్గా ఆడతాడు ’ అని రాథోర్ వివరించాడు.