తెలంగాణ లో లాక్ డౌన్ విషయంలో తర్జనభర్జన పడుతున్న మంత్రులు..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ ఏ మాత్రం పరిష్కారం కాదని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ విధించడం వల్ల పేదలు తీవ్ర స్థాయిలో సమస్యలు ఎదుర్కొంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల కరోనా వైరస్ కేసులు భయంకరంగా బయట పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ రాష్ట్రంలో లాక్ డోన్ పెట్టవలసిన పరిస్థితి రావొచ్చని హెచ్చరించడం జరిగింది. అయితే అవసరమైతేనే లాక్ డౌన్ ఉంటుందని, తర్వాత రోజు ఛీప్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు. తాజాగా విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాక్ డౌన్ పూర్తిగా విదించడం వల్ల నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించడం విశేషం. కరోనాకు సంబందించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.దీనిని బట్టి చూస్తుంటే తెలంగాణ లో లాక్ డౌన్ విషయంలో మంత్రులు తర్జనభర్జన పడుతున్నట్లు అర్థమవుతుంది.