వైయస్ జన్మదినాన్ని రైతు దినోత్సవం గా ప్రకటించిన జగన్..!!

వాస్తవం ప్రతినిధి:  జూలై 8 వ తారీకు వైయస్ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ తన తండ్రి వైయస్ జన్మదినోత్సవాన్ని ‘రైతు దినోత్సవం గా’ ప్రకటించారు. వైయస్ హయాంలో ఎక్కువగా రైతులకు మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో ఎక్కువగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతు ఉన్నాయి. వైయస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. ఇప్పటికే పలు పథకాలకు మరియు కొన్ని నవరత్నాలలో కార్యక్రమాలకు వైయస్ పేరు పెట్టడం జరిగింది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తన తండ్రి వైయస్ జన్మదినాన్ని రైతు దినోత్సవం గా జగన్ ప్రకటించడంతో ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వార్త విని ఏపీ రైతాంగం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తోంది.