కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో ఆటలాడుతున్న రాజకీయనేతలు..!!

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కొంతమంది రాజకీయ నేతలు మహమ్మారి కరోనా వైరస్ లక్షణాలు ఉంటే శాంపిల్స్ తీయించుకొని వాటిని తమ సిబ్బంది పేరిట టెస్టులు చేయించుకుంటున్నారట. ఈ క్రమంలో కరోనా రిపోర్ట్ నెగిటివ్ వస్తే సైలెంట్ గా ఉంటున్నారట. పాజిటివ్ వస్తే కామ్ గా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి పోతున్నారట. కానీ వివరాలు బయటకు రాకుండా ఈ రాజకీయ నేతలు వ్యవహరించడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నేతలు కాబట్టి వీరిని కలిసే వారికి కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని ఇంత నిర్లక్ష్యంగా రాజకీయ నేతలు వ్యవహరించ కూడదని వచ్చిన వార్తలపై వైద్యుల సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతలు కనీసం మాస్క్ కూడా ధరించు కోకుండా ప్రజలలోకి వెళుతూ ఉండటాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన రాజకీయ నాయకులు ఇలా ఉంటే సామాన్య జనులు ఇంకేం మాట వింటారని పలువురు మేధావులు ఈ వార్తపై సీరియస్ అవుతున్నారు.