మహా సర్కార్ కీలక నిర్ణయం..జూలై 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు!

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనా ను నిరోధించేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం కీల్కా నిర్ణయం తీసుకొంది. లాక్ డౌన్ ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తున్నలుగా ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదౌతున్న విషయం తెలిసిందే.