నిన్న తెలంగాణ హోంమంత్రి కి నేడు డిప్యూటీ స్పీకర్ కి..

వాస్తవం ప్రతినిధి: నిన్నటికి నిన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనాతో ఆస్పత్రిలో చేరారు. తాజాగా నేడు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్టు సమాచారం.

ఇలా వరుసగా అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి బిగాల గణేష్ బాజిరెడ్డిలు కరోనా బారినపడ్డారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుమారుడికి కూడా వైరస్ సోకినట్టు సమాచారం. మిగతా కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చింది. వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.

తెలంగాణలో ఇలా వరుసగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతుండడంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉండడంతో హైదరాబాద్ లో లాక్ డౌన్ దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.