అచ్చెన్నకు మరో షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు!

వాస్తవం ప్రతినిధి: ఈ‌ఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో ఆయనకు ఏసీబీ కోర్టు మరో షాక్ ఇచ్చింది. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉన్నందున ఈ నెల 30 వరకు కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఈక్రమంలో అచ్చెన్నాయుడు బెయిల్ ను మంజూరు చేయవలసిందిగా వేసిన పిటీషన్ లను కోర్టు వాయిదా వేసింది. జులై 1 న తిరిగి కోర్టులు తెరుచుకునే నాటికి బెయిల్ పిటిషన్ పై విచారిస్తామని కోర్టు వెల్లడించింది. అచ్చెన్నాయుడు కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రిలో ఏసీబీ కస్టడీలో ఉంచేందుకు అనుమతులను ఇచ్చింది. ఆ అనుమతుల గడువు ముగియడంతో తిరిగి రిమాండ్ కు తరలించింది. ఇక కరోనా మరలా విజృంబిస్తే జులై ,ఒదటి వారం కూడా కోర్టులు తెరుచుకోలేకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు..