అచ్చెన్నను హింసిస్తున్నారు: సోమిరెడ్డి

వాస్తవం ప్రతినిధి: అచ్చెన్నాయుడును ప్రభుత్వం హింస పెడుతుందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ పైల్స్ ఆపరేషన్ చేసిన వ్యక్తిని రెండో సారి ఆపరేషన్ చేసే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. బీపీ, షుగర్‌లతో ఇబ్బంది పడుతున్నారని… టీడీపీలో కీలక నేత అచ్చెన్నాయుడు పట్ల ప్రభుత్వ ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు.

గతంలో ఎప్పుడూ ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. విచారణ అనంతరం, తప్పు జరిగిందని తేలితే అరెస్ట్ చేయవచ్చని… గతంలో కరుణాకర్ రెడ్డిని ఇలాగే విచారించామా అని ప్రశ్నించారు. నోరు ఎత్తి ప్రస్నించిన ప్రతి ఒక్కరిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని వ్యాఖ్యానించారు. 151 సీట్లు ఇచ్చింది ప్రజలను హింసించడానికి కాదని…పాలన పట్ల జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు.