కరాచీలోని పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రదాడి

వాస్తవం ప్రతినిధి: ఈ ఉదయం పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజ్ పై జరిగిన ఉగ్రదాడి కలకలం రేపింది. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తుపాకి, గ్రనేడ్లతో వచ్చిన ఓ వ్యక్తి, బిల్డింగ్ లోకి ప్రవేశించి, దాడికి దిగాడు. అతనితో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా దాడికి రాగా, నలుగురినీ హతమార్చామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ బిల్డింగ్ హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉందని, చాలా బ్యాంకుల ప్రధాన శాఖలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు పోలీసులు. సిల్వర్ కలర్ లో ఉన్న కరోలా కారులో వచ్చిన నలుగురు టెర్రరిస్టులు…పార్గింగ్ ఏరియా నుంచి స్టాక్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్ లోకి ప్రవేశించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మొదట బిల్డింగ్ మెయిన్ గేట్ దగ్గర గ్రనేడ్లు విసిరాని… ఆ తర్వాత లొపలికి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు చెప్పారు.