కరోనాతో ఢిల్లీ మాజీ రంజీ క్రికెటర్ మృతి

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్‌తో ఢిల్లీ మాజీ రంజీ క్రికెటర్ సంజయ్ దోబల్(52) సోమవారం మరణించారు. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. సంజయ్ దోబల్ అకాల మరణం క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిందని డీడీసీఏ సెక్రటరీ వినోద్ తిహారా ఆవేదన వ్యక్తం చేశారు. డీడీసీఏ తరఫున దోబల్‌కు నివాళులు అర్పించిన వినోద్.. కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దోబల్.. మూడు వారాల క్రితమే కరోనా బారినపడ్డాడు.