నాకు కత్రీనా కైఫ్‌ అంటే ఇష్టం: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌

వాస్తవం ప్రతినిధి: బాలీవుడ్‌ హీరోయిన్‌లను పాకిస్థాన్‌ క్రికెటర్లు ఇష్టపడడం కొత్తేమి కాదు. తాజాగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కూడా ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ అంటే ఇష్టమట. జులై 28 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ ఆడేందుకు ఇవాళ పాక్ జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లేముందు ఓ ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడాడు. ఇంతలో దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్‌ ఇద్దరిలో మీకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరూ అని ఎదుటి వ్యక్తి అడగడంతో.. ‘నాకు కత్రీనా కైఫ్‌ అంటే చాలా ఇష్టం’ అని చెప్పాడు.