క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..!!

వాస్తవం సినిమా: ఇటీవల రేణు దేశాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. అడవి శేషు నటిస్తున్న మేజర్ సినిమాలో రేణు దేశాయ్ కీలకమైన పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వచ్చిన వార్తలను రేణుదేశాయ్ ఇటీవల ఖండించింది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇలాంటి వార్తలు రాసిన వారికి హాట్సాఫ్ అని తెలిపింది. మహేష్ బాబు సినిమా లో అవకాశం వస్తే నేనే ప్రకటన చేసేదాన్ని…అంత పెద్ద అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు అని రేణుదేశాయ్ తెలిపింది. గతంలో తాను సినిమా హీరోలకు తల్లిగా నటిస్తాను అని చెప్పింది చిన్ననాటి హీరోలు క్యారెక్టర్ చూపించే టైమ్లోనే అంటూ రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో మహేష్ బాబు సినిమా లో రేణు దేశాయ్ నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని తేలిపోయింది.