బన్నీ కోసం సరికొత్త లొకేషన్ వెతికిన సుకుమార్..!!

వాస్తవం సినిమా: ‘అల వైకుంఠ పురంములో’ సినిమా తో ఈ ఏడాది మొదటి లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే సినిమాకి సంబంధించి షూటింగ్ ఎక్కువ అడవి ప్రాంతాలలో జరగాల్సి ఉండగా మొదటి లో కేరళ ప్రాంతంలో దట్టమైన అడవులలో షూటింగ్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పరిస్థితులు పూర్తిగా మారిపోవటం తో..షూటింగ్ లకు అనుమతులు లేకపోవటంతో…తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఓ సరికొత్త లొకేషన్ సుకుమార్ వెతికినట్లు ఆ ప్రాంతంలో ‘పుష్ప’ సినిమా తీయాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఎవరు సినిమా తీయకపోవడంతో మొదటిగా సుకుమార్ దృష్టి లో ఈ దట్టమైన అడవుల లొకేషన్ బయటపడటంతో ఇండస్ట్రీలో చాలా మంది చూపు ఈ లొకేషన్ మీద పడింది. గంధపు చెక్కల స్మగ్లర్ తరహాలో అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో చాలావరకు సినిమా అడవి ప్రాంతాలలో చిత్రీకరించే పని ఏర్పడటంతో తెలంగాణ ప్రాంతంలోనే ఈ సినిమా దాదాపు 70 శాతం సినిమా షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం.