పవర్ స్టార్ టైటిల్ తో సినిమా చేయబోతున్న రామ్ గోపాల్ వర్మ..!!

వాస్తవం సినిమా: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. లాక్‌డౌన్‌ టైములో సినిమా ఇండస్ట్రీ అంతా షూటింగ్ లు ఆపేసి ఇంట్లో కూర్చుని ఉండగా, ఆర్జివి మాత్రం ఇంట్లోనే ఉండి ‘క్లైమాక్స్’ అనే సినిమాని టెక్నాలజీ ద్వారా తీసి ఓటిటి లో రిలీజ్ చేసి అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఇదే తరుణంలో ‘మర్డర్’ అనే సినిమా ని కూడా తెరకెక్కిస్తున్నాడు. అమృత మరియు మారుతీ రావు పేర్లు కలిగిన తండ్రి కూతుళ్ళ కథ , కూతురిని ప్రేమించిన దళితుడు ప్రణయ్ ని చంపిన మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ప్రేమ కథ ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ‘పవర్ స్టార్’ అనే టైటిల్ తో మరో సినిమా చేయబోతున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు…. ఆర్జివి ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాడు అన్న టెన్షన్ లో పడ్డారు.