లీక్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమా కి..??

వాస్తవం సినిమా: దాదాపు రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండటంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో మళ్లీ ‘వకీల్ సాబ్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమా తెలుగులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో క్లిప్ లీక్ రిలీజ్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. గతంలో కూడా సినిమా షూటింగ్ జరుగుతున్న టైములో పవన్ గుబురు గడ్డంతో ఉన్న వీడియో ఒకటి రిలీజ్ అయ్యింది. తాజాగా ఇటీవల రిలీజ్ అయిన వీడియో క్లిప్ లో పవర్ స్టార్ క్లీన్ షేవ్ తో లాయర్ కోటు ధరించి ఉన్నాడు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సినిమా యూనిట్ సభ్యులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.