రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు..!!

వాస్తవం ప్రతినిధి: దేశంలో రోజు రోజుకీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య జనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం దారుణం అని అంటున్నారు. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు ధర పెరిగింది. దీంతో హైదరాబాద్ లో దర పెట్రోలు 83.49 రూపాయలు, డీజిల్ 78.69 రూపాయలు అయితే, విజయవాడలో పెట్రోలు 83.82 రూపాయలు, డీజిల్ 78.98 రూపాయలు అయింది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర .80.43 రూపాయలు, లీటర్‌ డీజిల్‌ ధర 80.53రూపాయలకు చేరింది. ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం 10 రూపాయల 39 పైసలు, పెట్రోల్‌పై 9 రూపాయల 23 పైసలు పెరిగాయి. ముంబై లో అయితే ఏకంగా 87.19 రూపాయలు అయినట్లు వార్తలు వచ్చాయి.