ఆఖరికి తెలంగాణ హోం మంత్రి ని కూడా వదలని కరోనా..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది. చాలావరకు కమ్యూనిటి స్థాయిలో ఆల్రెడీ వైరస్ పాకి పోయిందని, టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టటం లేదని విమర్శలు వినబడుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ ఈ స్థాయిలో తెలంగాణలో విజృంభించడానికి కారణం నిర్ధారణ పరీక్షలు సరిగ్గా చేయకపోవటమే అని మేధావులు అంటున్నారు. న్యాయస్థానాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా టిఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకుండా ఉండడమే వల్లనే వైరస్ ఈ స్థాయిలో విజృంభించింది అని చాలామంది అంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ కూడా కరోనా పాజిటివ్ రావటంతో టిఆర్ఎస్ పార్టీలో టెన్షన్ నెలకొంది. మహమ్మద్ అలీ కి ఆస్తమా వుండటంతో ఇటీవల కరోనా లక్షణాలు ఉన్నట్లు కుటుంబసభ్యులు గమనించడంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా పాజిటివ్ అని తేలడం జరిగింది. హైదరాబాదులో భయంకరంగా వైరస్ వ్యాప్తి చెంది ఉండటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అందరూ అనుకుంటున్నారు.