జగన్ రాజకీయాలు అక్కడ చెల్లుతాయి ఏమో కానీ.. ఇక్కడ కాదు..??

వాస్తవం ప్రతినిధి: దాదాపు నాలుగు దశాబ్దాలు కలిగిన తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ చిత్తుచిత్తుగా ఓడించడం జరిగింది. ఆ ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు ఈ స్థాయిలో టీడీపీ పార్టీ ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం అని కామెంట్ చేయడం జరిగింది. జగన్ తన తండ్రి చనిపోయిన నాటినుండి పూర్తిస్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సమయం నుండి తన ప్రత్యర్ధి టీడీపీ అధినేత 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తో నువ్వానేనా అన్నట్టుగా జగన్ పోరాడి.. 2019 ఎన్నికల్లో ఓడించారు. ఇలాగే 2022 జరిగే ఎన్నిక్ల్లో కూడా టీడీపీ ని ఓడించాలని వైసిపి భావిస్తుంది. అయితే, జగన్ రాజకీయాలు ఎక్కడైన చెల్లుతాయి ఏమో కానీ, కృష్ణా జిల్లా లో చెల్లవు అంటున్నారు కొందరు టీడీపీ శ్రేణులు.

మొదట నుండి కృష్ణా జిల్లా నుండి చాలా ప్రముఖమైన రాజకీయ నాయకులు పదవులు అధిరోహించిన వాళ్ళు చరిత్రలో కనబడతారు. అటువంటి కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ గా ఎప్పటి నుండో రాణిస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందో ఆంధ్రాలో వైసీపీ పార్టీలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు చేరటం జరిగిన కృష్ణా జిల్లా పై పట్టు సాధించలేకపోయారు. అదే సమయంలో కృష్ణా జిల్లా ప్రజలు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ .. 2019 ఎన్నికలలో కృష్ణాజిల్లాలో విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలవడం జరిగింది. అదేవిధంగా వైసిపి నేతలు కొన్ని చోట్ల గెలిచారు. కానీ స్థానిక సమస్యలపై చిరాకు వచ్చి ప్రజలు వైసిపి పార్టీ ని దూరం పెడుతూ.. ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే మక్కువ చూపుతున్నట్లు టీడీపీ పార్టీకి చెందిన నేతలే జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పుతున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. పార్టీ ఓడిపోయిన కానీ ప్రజలు మాత్రం ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల చెంతకే వెళ్తున్నారట. ఎప్పటి నుండో కృష్ణాజిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండటంతోపాటు సీనియర్ నేతలుగా రాణించడంతో కొత్తగా వైసీపీ పార్టీ తరపున గెలిచిన నాయకుల దగ్గర కంటే టీడీపీ నాయకుల దగ్గరికే ప్రజలు వెళ్తున్నారట. అదేవిధంగా వైకాపా ఎదగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా అలర్ట్ గా ఉంటూ వైసీపీని చావు దెబ్బ తీయడానికి సరైన ప్లాన్స్ వేస్తున్నట్లు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.