ఆ విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయిన మోదీ.. నెటిజన్లు ఫైర్..!!

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుత్తం పాలిటిక్స్ లో సోషల్ మీడియా కూడా భాగం అయిపోయింది. ముఖ్యంగా ట్వీట్టర్. అధికార పక్షం అయినా.. ప్రతి పక్షం అయినా ఎక్కువగా ట్వీట్టర్ నే వేదికగా చేసుకున్ని వాళ్లు చెప్పాలి అనుకున్నది అనుకున్నట్లు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్టర్ నే మోదీ కొంప ముంచింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌రేంద్ర మోడీ 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన విష‌యం తెలిసిందే. ప్రధాని మోడీ 2012 జూన్ 27న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతుంది. ఈ క్రమంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఓ హాట్ ట్వీట్ చేశారు. దేశంలో పెట్రోల్ రేట్లను పెంచుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు కొల్లగొడుతోందని.. ఇది ప్రజలపై పెను భారాన్ని మిగులుస్తోందని.. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందానికి పెట్రో ధరల పెంపే నిదర్శనమని నాడు గుజరాత్ సీఎం మోడీ ఎండగట్టారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందానికి పెట్రో ధరల పెంపే నిదర్శనమని.. మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి ఇప్పుడు దేశంలో పెట్రోల్ ధరలు ఏ రేంజ్‌లో భగ్గుమంటున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో నాడు మోడీ పెట్టిన పాత పోస్ట్‌ను బ‌య‌ట‌కు తీసి.. నెటిజ‌న్లు ఆయ‌న్ను ఏకిపారేస్తున్నారు. నాడు సీఎంగా నినదించిన మోడీజీ ఇప్పుడు ఎందుకు పెట్రో ధరలు పెంచుతున్నారని ప్ర‌శ్నిస్తున్నారు. నాడు సీఎంగా నినదించిన మోడీజీ ఇప్పుడు ఎందుకు పెట్రో ధరలు పెంచుతున్నారని.. ఆయన ట్వీట్ నే బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ తెగ హల్ చల్ చేస్తోంది.