‘ ఆ పార్టీలో విలువలు, ధైర్యం, దేశ భక్తి లోపించాయి’: ప్రజ్ఞా ఠాకూర్

వాస్తవం ప్రతినిధి: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మరోమారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఓ ఫారెనర్ (విదేశీయురాలు)కు పుట్టిన బిడ్డ ఎప్పటికీ దేశ భక్తుడు కాలేడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె విమర్శించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల దేశభక్తిని ప్రజ్ఞా ప్రశ్నించారు. ‘ఒక బిడ్డ ఏ మట్టిలో పుడితే ఆ దేశాన్ని అతడు రక్షిస్తాడని చాణక్యుడు చెప్పాడు. విదేశీ మహిళకు జన్మించిన బిడ్డ ఎప్పటికీ దేశ భక్తుడు కాలేడు. మీకు రెండు దేశాల్లో పౌరసత్వం ఉంటే దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి. కాంగ్రెస్ నేతలకు ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీలో విలువలు, ధైర్యం, దేశ భక్తి లోపించాయి’ అని ప్రజ్ఞా ఠాకూర్ మండిపడ్డారు.