ఆందోళన చెందవద్దు అంటున్న కేసీఆర్..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. మొదటిలో వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ సక్సెస్ అయిందని అందరూ అనుకున్నా గాని తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లాక్‌డౌన్‌ టైములో ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి ప్రజలను అలర్ట్ చేస్తూ వైరస్ ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా ఉందో తెలియ చెప్పేవారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా హైదరాబాదు నగరంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో రాబోయే కొన్ని రోజుల్లో మళ్లీ పూర్తిస్థాయిలో GHMC పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ మళ్లీ అమలు చేయాలని కేసిఆర్ డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉండగా కేసులు బయట పడుతున్న తరుణంలో ఎవరు ఆందోళన చెందనవసరం లేదని, ముఖానికి మాస్క్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బతికితే చాలావరకు ఈ వైరస్ నుండి తప్పించుకోవచ్చని తెలంగాణ ప్రజలకు కెసిఆర్ తెలిపారు. కొంతమంది చేస్తున్న పొరపాటు వల్ల వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ వైరస్ అరికట్టడానికి సరికొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెప్పే సూచనలు పాటించాలని తెలిపారు.