జగన్ రాజధానిని మార్చలేరు అంటున్న టీడీపీ..!!

వాస్తవం ప్రతినిధి: వైఎస్ జగన్ త్వరలో అమరావతి నుండి విశాఖపట్టణానికి రాజధానిని తరలించడానికి రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. జూలై మాసంలో ఉద్యోగస్తులను పంపిస్తున్నట్లు ఆ తర్వాత కార్యాలయాలను తరలించడానికి రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని జగన్ ఇంచు కూడా తరలించలేరని పేర్కొన్నారు. ఇదే టైములో మరోపక్క రాజదాని ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు. జెఎసి చేస్తున్న ఉద్యమానికి టీడీపీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి కక్షతో వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించడం లేదని ఆరోపించారు. జెఎసి తీసుకునే నిర్ణయాలకు టీడీపీ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.