రోహిత్ శర్మపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు

వాస్తవం ప్రతినిధి: టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. హిట్‌మ్యాన్ ఎంతో విలువైన ఆటగాడని తెలిపాడు. రోహిత్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా అతను మరింత రాటుదేలుతాడని, అతను కష్టించే తత్వమే రోహిత్‌ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందన్నాడు. ఇక భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్ జట్టులో రోహిత్‌కు అవకాశం దక్కకపోవడంతో అతడిలో మరింత కసి పెరిగి కష్టించేలా చేసిందని, అదే అతని సక్సెస్‌కు కారణమైందని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పఠాన్ చెప్పుకొచ్చాడు.