ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత తాపీగా ఎలా..అలా?..సీ ఎం సారూ?

వాస్తవం ప్రతినిధి: మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గడిచిన మూడురోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. వణికిస్తున్న మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. ఒకరాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా జర్నీ చేయటం శివరాజ్ సింగ్ చౌహాన్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో? అంటూ చర్చించుకొంటున్నారు మన నెటిజన్లు. ఎందుకంటే నిన్న తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని త్రిదండి చిన జీయర్ స్వామి వారి ఆశ్రమానికి వచ్చిన ఆయన దాదాపు ఒకటిన్నర రోజుల పాటు గడిపినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత తాపీగా ఒక ఆశ్రమానికి వచ్చి గడపటం ఆశ్చర్యమంటున్నారు.

మరోవైపు అదే సమయంలో మరో పరిణామం చోటు చేసుకుంది. జీయర్ స్వామిని శివరాజ్ సింగ్ కలిసిన సందర్భంలో అక్కడే మైహోం గ్రూఫు ఛైర్మన్ తో పాటు.. మెగా సంస్థల అధినేత సైతం అక్కడే ఉన్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు వ్యాపార ప్రముఖులు తరచూ జీయర్ ఆశ్రమం వద్దనే ఉంటారు. కానీ..ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన కార్యక్రమానికిదగ్గరగా ఉండి అన్ని చూసుకోవటం విశేషంగా చెప్పాలి.